కనకదుర్గ చిట్ ఫండ్ డైరెక్టర్ ఆత్మహత్య
స్పాట్ వాయిస్, క్రైమ్: హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో కనకదుర్గ చిట్ ఫండ్స్ డైరెక్టర్ నల్ల భాస్కర్ రెడ్డి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్ కి చున్నీ తో ఉరేసుకొని మధ్యాహ్నం ఆత్మహత్య కు పాల్పడ్డాడు. భాస్కర్ రెడ్డి ప్రస్తుతం కనకదుర్గ చిట్ఫండ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా యాజమాన్యం ఈ ఘటన పై స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
హరిత హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడిన భాస్కర్ రెడ్డి గారికి మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు.
మా చిట్ ఫండ్లో డైరెక్టర్ అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏరోజు ఆయన మా డైరెక్టర్ గా లేరు. ఉద్యోగిగా కొంతకాలం పనిచేశారు. కరోనా కాలంలో మా బ్రాంచ్ లను మూసివేసిన సమయంలోనే ఆయన మా వద్ద ఉద్యోగం మానేసారు. దయచేసి మాపై తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దని కోరుతున్నాం.
From,
Managing Director,
కనకదుర్గ చిట్ ఫండ్స్.
Recent Comments