Sunday, April 6, 2025
Homeక్రైమ్సర్పంచ్ ఆత్మహత్యాయత్నం..

సర్పంచ్ ఆత్మహత్యాయత్నం..

సర్పంచ్ ఆత్మహత్యాయత్నం..
చేసిన పనులకు నిధులు రాలేదనే..
స్పాట్ వాయిస్, బ్యూరో : నిర్మల్ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్య కు యత్నించిoది. సర్పంచ్ భర్త తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని వేణునగర్ గ్రామానికి చెందిన రాధ ఆ ఊరికి సర్పంచిగా పని చేస్తుంది. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదు., దీంతో కుటుంబంలో డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాధా పురుగుల మందు తాగి శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పులు చేసి పనులు చేసిన ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో మనస్తాపం చెందిందని ఆమె భర్త అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్​ను జిల్లా కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments