అవినీతి ఆరోపణలే కారణం..
స్పాట్ వాయిస్, హన్మకొండ క్రైం: వరంగల్ కమిషనరేట్ పరిధిలో అవినీతికి పాల్పడిన మరో ఎస్సైపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. జూదం కేసులో సుబేదారి పోలీస్ స్టేషన్ ఎస్సై ఏ. విశ్వ తేజ అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టగా.. ఆరోపణలు రుజువు అయ్యాయి. దీంతో ఎస్సై ఏ. విశ్వ తేజను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు..
Recent Comments