Friday, May 30, 2025
Homeక్రైమ్కరీంనగర్ సీపీగా సుబ్బారాయుడు..?

కరీంనగర్ సీపీగా సుబ్బారాయుడు..?

భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..
ఎక్కడ ఎవరంటే..?
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 60 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కరీంనగర్, రామగుండం సీపీలను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్లగొండ, సిరిసిల్ల, మహబూబ్నగర్, వనపర్తి ఎస్పీలు బదిలీ అయ్యారు. రామగుండం సీపీగా సుబ్బారాయుడు, మల్కాజ్గిరి డీసీపీగా జానకి ధరావత్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కరీంనగర్ సీపీగా సుబ్బారాయుడు
రామగుండం సీపీగా రెమారాజేశ్వరి
నల్గొండ ఎస్పీగా అపూర్వరావు
వనపర్తి ఎస్పీగా రక్షితామూర్తి
ఖమ్మం సీపీ కొల్లు సురేశ్ కుమార్
మల్కాజ్‌గిరి డీసీపీగా జానకి దరావత్
ఎల్బీనగర్ డీసీపీగా సాయిశ్రీని నియమించినట్లు విశ్వసనీయ సమాచారం.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments