స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లాకు ఒక సంక్షేమ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. గతంలో ఉన్న 10 జిల్లాలు 33 జిల్లాలుగా మారినప్పటికీ కొత్తవి ఏర్పాటు కాలేదు. ప్రతీ కేంద్రంలో వంద మంది మాత్రమే చదువు కునే వీలు ఉండడం , వరుసగా నోటిఫికేషన్లు వస్తుండడంతో.. ప్రభుత్వం నూతన జిల్లాల ప్రాతిపదికన స్టడీ సర్కిళ్లపై దృష్టి సారించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల వారీగా ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వీలైనంత త్వరగా వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని సంక్షేమ శాఖలను ప్రభుత్వం కోరింది. ఇప్పటికే స్టడీ సర్కిళ్లు ఉన్న జిల్లాలను మినహాయించి, ఈ కేంద్రాలు లేని జిల్లాల్లో కొత్త వాటిని నెలకొల్పనున్నారు. సంక్షేమ శాఖలన్నీ స్టడీ కేంద్రాల ప్రతిపాదనలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి పంపించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాత వీటిని ఏర్పాటు చేయనున్నారు.
Recent Comments