Saturday, November 23, 2024
Homeక్రైమ్ఇంజిక్షన్ విక‌టించి విద్యార్థి మృతి

ఇంజిక్షన్ విక‌టించి విద్యార్థి మృతి

స్పాట్ వాయిస్, హసన్ పర్తి : ఇంజిక్షన్ విక‌టించడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండ‌ల‌ కేంద్రానికి చెందిన మీసరకొండ అవినాష్ (12) మామునూరులోని మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకులంలో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే అతడికి జ్వరం రావడంతో అవినాష్ ను అతడి తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం హసన్ పర్తిలోని ఓ ఆర్ ఎంపీ దగ్గరకు తీసుకెళ్లామని చెప్పారు. పరీక్షించిన ఆర్ ఎంపీ బాలుడికి జ్వరం వచ్చిందని చెప్పి రెండు ఇంజిక్షన్లు ఇచ్చాడన్నారు. అయితే ఇంజిక్షన్ వికటించడంతో సోమవారం తెల్లవారుజామున చనిపోయాడని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments