Saturday, November 23, 2024
Homeక్రైమ్వైద్యం వికటించి విద్యార్థి మృతి..?

వైద్యం వికటించి విద్యార్థి మృతి..?

 

వైద్యం వికటించి విద్యార్థి మృతి..?

సిద్ధార్థ గురుకులం
ఎదుట తల్లిదండుల ఆందోళన

అడ్డుకున్న పోలీసులు

స్పాట్ వాయిస్, నర్సంపేట (చెన్నారావుపేట): వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యం వికటించి వికటించి విద్యార్థి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి, విద్యార్థి చదువుతున్న పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం చెన్నారావుపేట మండలంలోని పుల్లయ్యబోడు గ్రామానికి చెందిన భూక్యవిహాన్ (8) చెన్నారావుపేట సిద్ధార్థ హై స్కూల్ లో మూడవ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి పాఠశాలలో ప్రమాదవశాత్తు కింద పడి చేయి విరిగింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. ఆపరేషన్ చేసిన అనంతరం విద్యార్థి మృతి చెందాడు. ఆపరేషన్ సమయంలో ఇచ్చే మత్తుమందు డోస్ ఎక్కువ అవ్వడంతోనే విద్యార్థి మృతి చెందినట్లు సమాచారం. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ సమ్ము నాయక్ ఆధ్వర్యంలో చెన్నారావుపేటలోని సిద్దార్థ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో నెక్కొండ సీఐ హథిరాం, చెన్నారావుపేట ఎస్సై తోట మహేందర్, నర్సంపేట ఎస్సై రవీందర్, నెక్కొండ ఎస్ఐ సీమా పర్హీన్ లు గ్రామస్తులను అడ్డుకున్నారు. పాఠశాల యాజమాన్యంతో తాము మాట్లాడాలని గ్రామస్తులు కోరగా సర్పంచ్ తో పాటు మరో ముగ్గురిని లోపలికి అనుమతించారు. చర్చల అనంతరం బాలుడి దహన సంస్కారాల నిమిత్తం 20 వేల రూపాయలను పాఠశాల యాజమాన్యం అందించారు. ఏమైనా ఉంటే మరుసటి రోజు విద్యార్థి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments