Saturday, April 19, 2025
Homeక్రైమ్వరంగల్ లో స్టెరాయిడ్స్ విక్రయ కలకలం

వరంగల్ లో స్టెరాయిడ్స్ విక్రయ కలకలం

వరంగల్ లో స్టెరాయిడ్స్ విక్రయ కలకలం

మట్వాడ ఠాణాలో మొట్టమొదటి కేసు నమోదు 

ఒకరి అరెస్టు.. పరారీలో ముగ్గురు

వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ వెల్లడి

స్పా్ట్ వాయిస్, క్రైమ్ : వరంగల్ లో స్టెరాయిడ్స్ విక్రయం కలకలం రేపుతోంది. నగరంలో నిషేదిత స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది మొదటి స్టెరాయిడ్స్ కేసు కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ వెల్లడించారు. వరంగల్ మంగళికుంట, డాక్టర్స్ కాలనీ -2 మార్కండేయ వీధికి చెందిన కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్ నిషేదిత స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.20వేల విలువ కలిగిన నిషేదిత స్టెరాయిడ్స్ పట్టుబడినట్లు వెల్లడించారు. బాడీ బిల్డింగ్ పై ఆసక్తితో ఐదేళ్ల క్రితం హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని జేడీ జిమ్ లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో కందగట్ల శ్రావణ్ కుమార్ కు ఆన్ లైన్ లో ప్రశాంత్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. త్వరగా శారీరక దృఢత్వాన్ని సాధించాలంటే స్టెరాయిడ్స్ వినియోగించాలని ఆయన సూచించడంతోపాటు శ్రావణ్ కుమార్ కు తెలిపారు. అప్పటి నుంచి శ్రావణ్ కుమార్ స్టెరాయిడ్స్ వినియోగించడంతో పాటు వైజాగ్ ప్రాంతానికి చెందిన మణికంఠ, ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి స్టెరాయిడ్స్ కొనుగోలు చేస్తూ శారీరక దృఢత్యాన్ని పెంచుకోవాలనుకునే వారికి విక్రయిస్తూ అక్రమమార్గంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రశాంత్, మణికంఠ, ఆనంద్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఏసీపీ ఆయన తెలిపారు. తక్కువ సమయంలో శారీరక దృఢత్వాన్ని పొందడం కోసం నిషేదిత ఉత్పత్తులను వాడటం వల్ల భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే గుండె సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఏసీపీ వెల్లడించారు. నిందితుడిపై కాగా, శ్రావణ్ కుమార్ పై కాస్మెటిక్స్ అండ్ డ్రగ్స్ యాక్ట్ 1940 సెక్షన్ 18, భారతీయ శిక్షాస్మృతి 318(4), 123 ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు కీలక ఆధారాలు సేకరించిన మట్టెవాడ పోలీసులను ఏసీపీ నందిరాం నాయక్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments