మధ్యాహ్నం ఒంటి గంటకు రిలీజ్ చేయనున్న సీఎం
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల ఫలితాల రేపు విడుదల కానున్నాయి. ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతిలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరగ్గా దాదాపు 5లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం, మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావడంతో అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bse.telangana.gov.inలో పొందవచ్చు. పదో తరగతిలో ఈ సారి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు.
రేపే.. టెన్త్ రిజల్ట్
RELATED ARTICLES
Recent Comments