ఉత్సాహంగా పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
స్పాట్ వాయిస్, సుబేదారి : హన్మకొండ రామ్ నగర్ లోని ఎస్సార్ స్కాలర్స్ స్కూల్ లో బుధవారం ముందస్తు దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను సుందరంగా అలంకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద జోనల్ ఇన్ చార్జి కవితారెడ్డి, ప్రిన్సిపాల్ సంకీర్తనా రెడ్డి టీచర్లతో కలిసి లక్ష్మీపూజ నిర్వహించారు. అనంతరం దీపాలు వెలిగించారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలో పటాకులు కాల్చి, ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంకీర్తనా రెడ్డి దీపావళి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ అని, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనమంతా పండుగను జరుపుకుంటామని తెలిపారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగల్లో ఇది కూడా ముఖ్యమైందన్నారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతలను తెలియజేయడంలో భాగంగా ముందస్తు దీపావళి వేడుకలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హాని కలిగించకుండా దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు.
Recent Comments