తీజ్ పండుగకు నిధులు ఇవ్వాలి
-బంజారా గిరిజన సమైక్య వరంగల్ జిల్లా అధ్యక్షులు సపావట్ మహేందర్ నాయక్ డిమాండ్
స్పాట్ వాయిస్, సంగెం : మండలంలోని బిక్కోజినాయక్ తండా శివారు సపావట్ తండాలో ఆదివారం శ్రీ రాంరావు మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు బాగుండాలని, పంట పొలాలు పండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం సేవాలాల్ గుడి, మెరమాయాడీ గుడి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, అలాగే తీజ్ పండుగకు నిధులు ఇవ్వాలని బంజారా గిరిజన సమాఖ్య వరంగల్ జిల్లా అధ్యక్షుడు సపావట్ మహేందర్ నాయక్ అన్నారు. ఆదివారం మహేందర్ నాయక్ ఆధ్వర్యంలో పూజారి సపావట్ వెంకటేశ్వర్లు అధ్యక్షత రాజయోగి, మహా తపస్వి, ధర్మ గురు సంత్ శ్రీ రాంరావ్ మహారాజ్ 89వ జయంతిని ఘనంగా జరిపించారు. ఈ సందర్బంగా మహేందర్ నాయక్ మాట్లాడుతూ రానున్న తీజ్ పండుగ 8 ఆగస్టు 2024 రోజును అధికారకంగా సెలవు దినం ఇవ్వాలని, తీజ్ పండుగకు ప్రభుత్వం నుంచి ప్రతి తండాకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీమ్సాగర్ నాయక్ సతీమణి భూలక్ష్మి, కిషన్ నాయక్, హానుము నాయక్, వీరన్న నాయక్, శ్రీను నాయక్, రాహుల్ నాయక్, సైనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments