‘ఎస్సార్ స్కాలర్స్’లో మట్టి వినాయకుల ప్రతిమల తయారీ
చిట్టి గణపయ్యలతో చిన్నారుల సంబురం
స్పాట్ వాయిస్, హన్మకొండ : వినాయక చవితి సందర్భంగా హన్మకొండ రామ్ నగర్ లోని ఎస్సార్ స్కాలర్స్ హై స్కూల్ లో మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. ఈ సందర్భంగా మట్టి విగ్రహాలను ఎలా తయారు చేసుకోవాలని, దానిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంకీర్తనా రెడ్డి మాట్లాడుతూ ప్రమాదకర రంగులతో ఆకర్షణీయంగా తయారు చేసే విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. అందుకే ప్రతీ ఇంట్లో మట్టి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. చిన్నప్పటి నుంచే పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలనే అంశంపై అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్నారులు తయారు చేసిన చిట్టి గణపయ్యలు పలువురిని ఆకట్టుకున్నాయి. కాగా, విద్యార్థులు తయారు చేసిన విగ్రహాలను తోటి విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జోనల్ ఇన్ చార్జి కవితారెడ్డి, ప్రిన్సిపాల్ సంకీర్తనా రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Recent Comments