ఎస్సార్ స్కాలర్స్ హై స్కూల్ లో గ్రీన్ డే..
-మొక్కలు నాటిన ఉపాధ్యాయులు, విద్యార్థులు..
స్పాట్ వాయిస్, హన్మకొండ: హన్మకొండ రామ్ నగర్ లోని ఎస్సార్ స్కాలర్స్ హై స్కూల్లో శనివారం గ్రీన్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆకుపచ్చ రంగు గల డ్రెస్ లు ధరించి సందడి చేశారు. అలాగే పచ్చని రంగు గల బెలూన్లు, తదితర వస్తువులతో క్లాస్ రూమ్ లను సుందరంగా అలంకరించారు.. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆకుపచ్చ రంగు ఆరోగ్యకరమైన పర్యావరణానికి చిహ్నమన్నారు. రంగులు మానసిక ఉల్లాసానికి, స్నేహ భావానికి ప్రతీక అని.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో స్నేహభావం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పచ్చని రంగు గల కూరగాయాలు, పండ్లు తినడం వల్ల కలిగే లాభాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జోనల్ ఇన్ చార్జి, ప్రిన్సిపాల్, టీచర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Recent Comments