వార రాశిఫలాలు
(28-08-2022 to 03-09-2022)
మేషం:-
ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. .
వృషభం:-
అవసరానికి ఆదాయం సమకూరుతుంది. కొన్ని వ్యవహారాలలో బందు మిత్రులతో చర్చలు చేస్తారు. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అధికారుల నుండి అందిన ఒక సమాచారం నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
మిథునం:-
వారం ప్రారంభంలో వివాదాలు ఉన్నపటికీ క్రమంగా సర్దుబాటు చేసుకుంటారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో స్థిరస్తి వివాదాల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున ఉన్నత అధికారుల సహాయం అందుతుంది.
కర్కాటకం:-
చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చాలకాలంగా వేదిస్తున్న కొన్ని సమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు.
సింహం:-
కొన్ని వ్యవహారాలలో నూతనోత్సాహంతో ముందడుగు సాగి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో కీలక సమాచారం అందుతుంది.
కన్య:–
సంతనానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.
తుల:-
వారం ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. క్రమక్రమంగా పరిస్థితులు సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అవసరానికి అదనపు ఆదాయం సమాకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి.
వృశ్చికం:-
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. స్సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
ధనుస్సు:-
ఆర్థిక వ్యవహారాలలో కొంత గందరగోళంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. చిన్ననాటి మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మకరం:-
మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్థులకు అధికారులతో చర్చలు సఫలమౌతాయి.
కుంభం:-
సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు.
మీనం:-
నూతన వ్యక్తులు పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి.
Recent Comments