ఏనుమాములలో నిలిచిన మిర్చి కొనుగోళ్లు..
స్పాట్ వాయిస్, కాశీబుగ్గ: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సోమవారం మిర్చి కొనుగోళ్లు నిలిచి పోయాయి. అడ్తిదారులు ,వ్యాపారులు మూకుమ్మడిగా కొనుగోళ్లు నిలిపివేశారు. వివరాల్లోకి వెళ్తే..మార్కెట్ లో గతంలో మిర్చి కొనుగోలు చేసిన నాగేందర్ ట్రేడింగ్ కంపెనీ.. అడ్తిదారులు, రైతులకు డబ్బులు ఇవ్వకుండా బోర్డు తిప్పేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రికవరీ కి ఒప్పుకొని తన ఆస్తుల చిట్టా చెప్పారు. కాగా పోలీసులు అతడి ఆస్తుల లెక్క చాంబర్ కు అప్పగించారు. బ్యాంకు లో తాకట్టు ఉన్న ఫ్లాట్ ను విడిపించి ఇటీవలే బాధితులు విక్రయించగా.. మరో వ్యాపారి ఐలయ్య అది తన ల్యాండ్ అంటు కబ్జా చేశాడు. పోలీసులు, చాంబర్ చెప్పినా వినలేదు. ఆ స్థలం నాదేనంటూ కొనుగోలు దారుడు పెట్టుకున్న ప్రహరీ ని సైతం కూల్చేశాడు. బాధితులు సోమవారం కొనుగోళ్లు బంద్ చేశారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Recent Comments