స్పాట్ వాయిస్, మెదక్ : రైతు బీమా డబ్బుల కోసం ఓ భార్య దారుణానికి ఒడగట్టింది. తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి మంగళవారం కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. మెదక్జిల్లా కౌడిపల్లి మండలం పీర్ల తండా గ్రామ పంచాయతీ కొయ్యగుండు తండాకు చెందిన కాట్రోత్ శ్రీను, దేవి భార్యాభర్తలు. ఈ నెల 18న శ్రీను పొలం వద్ద శవమై కనిపించాడు. పోలీసులు విచారణలో భార్య దేవి, మరో ఇద్దరితో కలిసి శ్రీనును హత్య చేసినట్టు తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఎల్ఐసీ, రైతు బీమా సొమ్ము పొందేందుకు భర్తను హత్య చేశారాని తెలిసింది. తనకు సహకరిస్తే రూ. 50 వేలు ఇస్తానని అదే తండాకు చెందిన పవన్ కుమార్ తో బేరం కుదుర్చుకుంది. ఫ్రెండ్ రాణితో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ నెల 18న శ్రీనును మద్యం తాగుదామంటూ పవన్ కుమార్ గ్రామ శివార్లలోకి తీసుకెళ్లాడు. మద్యం తాగిన శ్రీను మత్తులోకి జారుకున్న అనంతరం దేవి నైలాన్ తాడును అతడి గొంతుకు చుట్టి సమీపంలోని వేప చెట్టుకు ఉరివేసి హత్య చేసింది. అనంతరం ముగ్గురు కలిసి మృతదేహని 600 మీటర్ల దూరం లాక్కెళ్లి పడేశారు. 19న ఉదయం పొలం వద్ద శ్రీను మృతదేహాని తండావాసులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సెల్ ఫోన్ సంభాషణల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.
Recent Comments