మానవత్వం చాటుకున్న గంగారం సర్పంచ్ తెప్పల దేవేందర్ రెడ్డి
స్పాట్ వాయిస్, మల్హర్, (కాటారం) : భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం సర్పంచ్ తెప్పల దేవేందర్ రెడ్డి మానవత్వం చాటుకుంటున్నారు. భారీ వర్షానికి గోదావరి ఉప్పొంగి మండలంలోని దామెరకుంట, దుబ్బపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లోకి వరద చేరడంతో ఆ గ్రామాల ప్రజలకు గంగారం గ్రామంలోని స్థానిక మోడల్ స్కూల్ లో ఉప సర్పంచ్ సేనం సమ్మయ్య, నాయకులు ప్రభాకర్ రెడ్డి సహకారంతో సుమారు 980 మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే దాదాపుగా ఎనిమిది వందల మంది కి పైగా బాధితులకు ఆశ్రయం కల్పించామని, ఇంకా రెండు వందలకు పైగా మంది రాబోతున్నారని, వారందరికీ భోజనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గంగారం గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న గంగారం సర్పంచ్ తెప్పల దేవేందర్ రెడ్డి
RELATED ARTICLES
Recent Comments