Monday, November 25, 2024
Homeజనరల్ న్యూస్ఈ వారం .. మీ రాశీఫలం

ఈ వారం .. మీ రాశీఫలం

వార ఫలాలు

(26-06-2022) నుండి (02-07-2022) వరకు
మేషం:
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. రుణబాధల నుంచి ఉపశమనం పొందుతారు
వృషభం:
గృహమున కొన్ని విషయాలలో సహనం పాటించడం మంచిది.అనుకున్న వ్యవహారాలు అంచనాలకు అనుగుణంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమౌతాయి.
మిథునం:
సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
కర్కాటకం:
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.
సింహం:
గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగక ఇబ్బంది కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు.
కన్య:
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి.
తుల:
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. స్ధిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు.
వృశ్చికం:
ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధు, మిత్రులతో ఊహించని విభేదాలు నెలకొంటాయి.
ధనుస్సు:
గృహంలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా చికాకు పరుస్తాయి.
మకరం:
ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సోదరుతో చర్చలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా కొంత చికాకులు తప్పవు.
కుంభం:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు తొలగుతాయి.అనారోగ్య సమస్యలు నుండి బయట పడతారు.
మీనం:
వృత్తి వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి.చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments