Monday, September 23, 2024
Homeజనరల్ న్యూస్ఈ వారం... మీ రాశీ ఫలం

ఈ వారం… మీ రాశీ ఫలం

19-06-2022) నుండి (25-06-2022) వరకు
మేషం
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. గృహ నిర్మాణయత్నాలు పుంజుకుంటాయి.
వృషభం
చాలకాలంగా వేధిస్తున్న వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
మిథునం
సన్నిహితుల నుంచి అవసరానికి ధన సాయం అందుతుంది. సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పొందుతారు. ఆస్తి విషయాల్లో సమస్యలు తీరుతాయి.
కర్కాటకం
కుటుంబ సభ్యులతో కీలక విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహం
ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
కన్య
శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు సమాజంలో ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహపరుస్తుంది.
తుల
ఆప్తుల నుంచి అందిన సమాచారం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృశ్చికం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు.
ధనుస్సు
అనుకున్న పనులు స్వయం కృషితో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది.
మకరం
సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
కుంభం
శత్రు సమస్యలు నుంచి తెలివిగా బయట పడతారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి ఊరట లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
మీనం
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments