జరిమానా సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమ
స్పాట్ వాయిస్ నర్సంపేట, (ఖానాపురం) : నాటుసారా తయారు చేసిన వ్యక్తికి ఖానాపురం తహసీల్దార్ రూ.లక్ష జరిమానా విధించగా సోమవారం ప్రభుత్వ ఖజానాలో జమ చేశాడు. నర్సంపేట ఎక్సైజ్ సీఐ రాజసమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం మండలం బోటి మీద తండాకు చెందిన భూక్యా బాలు గతంలో నాటుసారా తయారు చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశారు. అయినా బాలు సెప్టెంబర్ నెలలో మరోసారి నాటుసారా తయారు చేయగా తిరిగి కేసు నమోదు చేసి తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. దీంతో నిబంధనలు ఉల్లంగించినందున సదురు వ్యక్తికి తహసీల్దార్ లక్ష రూపాయల జరిమానా విధించారు. అట్టి జరిమానా మొత్తాన్ని సోమవారం ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరిగిందన్నారు. నాటు సారా తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా, నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు నిల్వ, రవాణా చేసిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజసమ్మయ్య తెలిపారు.
Recent Comments