వరదల్లో చిక్కుకున్న గొర్రెల కాపరులు
రక్షించిన కొయ్యూరు పోలీసులు..
స్పాట్ వాయిస్ , మల్హర్: వరద నీటిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను కొయ్యూరు పోలీసులు రక్షించారు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మల్హర్ మండలం శాలపల్లి వద్ద.. ఉన్న రోడ్డు డౌన్ వద్ద ఇద్దరు వ్యక్తులు గొర్రెల తో చిక్కుకున్న ట్లు డయల్ 100 ద్వారా కొయ్యూరు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ ల సాయంతో వారిని రక్షించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరూ బయటికి వెళ్లొద్దని సూచించారు.
వరదల్లో చిక్కుకున్న గొర్రెల కాపరులు
RELATED ARTICLES
Recent Comments