మత్తడి పోస్తున్న కటాక్ష పూర్ చెరువు..
రోడ్డుపై పరుగులు తీస్తున్న నీరు..
స్పాట్ వాయిస్, ఆత్మకూరు: మండలంలోని కటాక్ష పూర్ చెరువు మత్తడి పోస్తుంది. వరుస వర్షాలతో.. చెరువులోకి వరద నీరు భారీగా చేరడంతో శుక్రవారం ఉదయం నుంచి మత్తడి దునుకుతోంది. ములుగు-వరంగల్ ప్రధాన రహదారి పక్కనే చెరువు ఉండగా.. మత్తడి నీరు రోడ్డుపై జలజలా పారుతోంది. తక్కువ స్థాయిలో నే మత్తడి పడడంతో ప్రయాణాలకు ఆటంకం ఏర్పడలేదు. రోడ్డుపై సవ్వడి చేస్తూ.. పరుగులు తీస్తున్న నీటిని చూసి గ్రామస్తులు, ప్రయాణికులు సంబుర పడుతున్నారు. సెల్ఫీ ల కోసం పోటీ పడుతున్నారు.
Recent Comments