Saturday, September 21, 2024
Homeక్రీడలుయువతను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు

యువతను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు

క్రీడల్లో యువతను ప్రోత్సహించడమే లక్ష్యం
అన్ని సదుపాయాలతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు
ఎమ్మెల్యే అరూరి రమేష్
స్పాట్ వాయిస్, హసన్ పర్తి : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని టీఆర్ ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామంలో హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తో కలిసి గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే అరూరి ప్రారంభించారు. అనంతరం అనంతసాగర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ. 41 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, పబ్లిక్ టాయిలెట్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు సరైన మైదానాలు లేక ఎంతో మంది యువత తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోలేక పోతున్నారని తెలిపారు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకే తెలంగాణ ప్రభుత్వం గ్రామానికో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి నిరంతర కార్యక్రమమని, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదకరంగా ఉండాలనేదే పల్లె ప్రగతి ప్రధాన ఉద్దేశమని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో మండలంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments