Sunday, April 20, 2025
Homeతెలంగాణనోరు జారా... క్షమించండి

నోరు జారా… క్షమించండి

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
స్పాట్ వాయిస్, రంగారెడ్డి: తాండూరు సీఐను దూషించింనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి తెలిపారు. పొరపాటున నోరు జారానని అన్నారు. ఆడియో క్లిప్పులతో పోలీసుల మనసు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందని అన్నారు. తన వ్యాఖ్యల వల్ల పోలీసులు బాధపడితే క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. సీఐను కలవనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. ‘పోలీసు సోదరులంతా నా కుటుంబ సభ్యులతో సమానం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రతలలో వారి కృషి అభినందనీయమన్నారు. నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లాప్‌లు ఆవేశంగా మాట్లాడిన నేపథ్యంలో పొరపాటున నోరుజారి కొంత మంది మిత్రులు, పోలీసులు బాధపడితే తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాన్నారు. పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం’ అంటూ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments