Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ

ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ

స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (76) ఆస్పత్రిలో చేరారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె గురువారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు శుక్రవారం ఉదయం ప్రకటన విడుదల చేశారు. జ్వరం కారణంగా ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆప్రకటనలో తెలిపారు. అయితే సోనియా గాంధీ ఈ ఏడాదిలో ఆస్పత్రిలో చేరడం ఇది రెండవసారి. శ్వాసకోస ఇన్ఫెక్షన్ కారణంగా గత జనవరిలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే రాజకీయ ఇన్నింగ్స్ సైతం ముగిసిందంటూ చెప్పకనే చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments