Wednesday, April 16, 2025
Homeతెలంగాణగంజాయికి.. కారం ట్రీట్ మెంట్..

గంజాయికి.. కారం ట్రీట్ మెంట్..

నెట్టింట్లో వైరల్
స్పాట్ వాయిస్, సూర్యాపేట: గంజాయికి బానిసైన కొడుక్కు ఓ తల్లి కారం ట్రీట్ మెంట్ చేసింది. ఇంకోసారి చెడు స్నేహాల వైపు వెళ్తావా అంటూ.. స్తంభానికి కట్టేసి.. కళ్లల్లో కారం పోసింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో ఈ ఘటన జరిగింది. గంజాయి తాగి ఇంటికివ‌చ్చిన కొడుకును ఇరుగుపొరుగువాళ్ల సాయంతో ఆ త‌ల్లి స్తంభానికి తాళ్లతో క‌ట్టేసింది. ఆ త‌ర్వాత కారం తీసుకొచ్చి కళ్లలో కొట్టింది. ఆ కొడుకు గిల‌గిలా కొట్టుకుంటుంటే బాధను దిగమింగుకొని.. కొడుకు మారాలని పైకి కోపాన్ని ప్రదర్శించింది. తల్లి ఇచ్చిన కారం ట్రిట్ మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments