స్పాట్ వాయిస్, హన్మకొండ టౌన్: ఓ సాహితీ కెరటం ఆగిపోయింది.. అద్భుత కవితలు వినిపించే స్వరం మూగబోయిందని ప్రముఖ కవి, కాళోజీ ఫౌండేషన్ చైర్మన్ నాగిళ్ల రామశాస్త్రి అన్నారు. ఆదివారం బాలసముద్రంలోని ఆదర్శ లా కాలేజీలో కవయిత్రి డాక్టర్ కందాళ శోభారాణి స్మరణ సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రామశాస్త్రి మాట్లాడుతూ.. శోభారాణి మరణం ఓరుగల్లు సాహితీ లోకానికి తీరనిలోటని కవులు సాహితీవేత్తలు వారి మరణం జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. కార్యక్రమానికి ముందు శోభారాణి భర్త తాటిపాముల రమేష్ కుమారుడు కౌశిక్ లతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాల మౌనం పాటించి సంతాపం తెలిపారు. శోభారాణి పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల ప్రయోగాల నిమిత్తం అందించడం ఆమె సమాజ సేవకు నిదర్శనం కవులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని సాహితీ సంస్థలు, ఉజ్వల సాహితీ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకుడు మహమ్మద్ సిరాజుద్దీన్, సభ్యులు శనిగరపు రాజమోహన్, అరసం జిల్లా అధ్యక్షుడు నిధి బ్రాహ్మచారి, విరసం జిల్లా కన్వీనర్ కోడం కుమార స్వామి, తెలంగాణ సాహితీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ కొగిల చంద్రమౌళి, వరంగల్ రచయితల సంఘం అధ్యక్షుడు నల్లెల రాజయ్య, ప్రజాస్వామిక రచయితల సంఘం రాష్ట్ర బాధ్యులు అనిశెట్టి రజిత, సామాజిక వేత్తలు నిమ్మల శ్రీనివాస్, సాగంటి మంజుల, సాహిత్య విజ్ఞాన ప్రతిభ మామూనూర్ ఎర్ర విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు.
శోభారాణి మరణ సాహితీ లోకానికి తీరని లోటు
RELATED ARTICLES
Recent Comments