ప్రతీ గింజను కొంటాం..
తేమ శాతం సడలిస్తాం..!
మంత్రి గంగుల కమలాకర్
స్పాట్ వాయిస్, కరీంనగర్: తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి తెస్తే.. ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. మంగళవారం కరీంనగర్ మండలం బొమ్మకల్, దుర్శేడు, గోపాల్ పూర్, చేగుర్తి గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాలను మంత్రి పరిశీలించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన తడిచిన ధాన్యాన్ని కొంటామని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షాలకు గతంలో 10 నుంచి 30 శాతం వరకు మాత్రమే నష్టం జరిగేదన్నారు. కానీ ఈసారి 100కు వంద శాతం పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. చేతికొచ్చిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ. 10వేలు ఇస్తున్నామని వెల్లడించారు. సివిల్ సప్లై ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన ప్రతి ధాన్యం గింజనుకొంటామని హామీ ఇచ్చారు. రైతులు ఆధైర్య పడొద్దని చెప్పారు. తేమ శాతాన్ని సడలించాలని ఎఫ్ సీఐని కోరామని.. వాళ్లు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
తడిచిన వడ్లను ఆరబెట్టి తెండి..
RELATED ARTICLES
Recent Comments