భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: ఈస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ రైలులో పొగలు వచ్చాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ట్రైన్ హైదరాబాద్ నుంచి శాలీమర్ వెళ్తుండగా కురవి మండలం గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్‌లో ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు ఈ ఘటనతో అరగంటపాటు ట్రైన్ ఆగిపోయింది. బ్రేక్‌లైన్ పట్టేయడంతో పొగలు వచ్చినట్లుగా సిబ్బంది పేర్కొన్నారు. రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మరమ్మతులు చేశారు. దాదాపు అరగంట తర్వాత రైలు మళ్లీ బయలుదేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో పొగలు..
RELATED ARTICLES
Recent Comments