Thursday, November 21, 2024
Homeజాతీయంయుద్ధానికి స్మాల్ బ్రేక్..

యుద్ధానికి స్మాల్ బ్రేక్..

ప్రకటించిన రష్యా
ఉక్రెయిన్‌లో ఆగిన కాల్పులు
స్పాట్ వాయిస్, డెస్క్: ఉక్రెయిన్‌లో దాడులకు దిగుతున్న రష్యా తాజాగా కాల్పుల విరమణ ప్రకటించింది. దీంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 11.30 గంటలకు కాల్పులను ఆపేసినట్లు రష్యా వెల్లడించింది. ఐదున్నర గంటల పాటు ఎలాంటి దాడులు చేయమని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులను తరలించడంతో పాటు దేశ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ విరామం ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు విదేశీయుల తరలింపునకు సహకరిస్తామని యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (యూఎన్‌హెచ్‌ఆర్సీ)కు రష్యా తెలిపింది. మానవతా దృక్పథంతో విరామం ఇచ్చామని పేర్కొంది. విదేశీయులు త్వరితగతిన ఉక్రెయిన్ వీడాలని సూచించింది. కేవలం కాల్పుల విరామం మాత్రమే ఇచ్చామని.. పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ఆపలేదని పేర్కొంది. మరోవైపు ప్రపంచ దేశాల ఒత్తిడితోనే రష్యా ఈ యుద్ధ విరామ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రష్యా తాజా నిర్ణయంతో పది రోజుల నుంచి జరుగుతున్న యుద్ధానికి కొన్ని గంటలు బ్రేక్ పడింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments