Saturday, April 5, 2025
Homeతెలంగాణఅధికారులైతే ఇంటికి... కాంట్రాక్టర్లు అయితే బ్లాక్ లిస్ట్‌లోకి..

అధికారులైతే ఇంటికి… కాంట్రాక్టర్లు అయితే బ్లాక్ లిస్ట్‌లోకి..

అధికారులైతే ఇంటికి… కాంట్రాక్టర్లు అయితే బ్లాక్ లిస్ట్‌లోకి…

మంత్రి సీతక్క వార్నింగ్

స్పాట్ వాయిస్, ములుగు: గోదావరి నుంచి ఇసుకను తరలించే లారీలను నియంత్రించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అధిక లోడు తో వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం జాతర దృష్ట్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలిపారు. ఓవర్ లోడ్‌తో వచ్చే లారీలను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడారం జాతర పనుల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అధికారులైతే ఇంటికి… కాంట్రాక్టర్లు అయితే బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్తారని మంత్రి సీతక్క హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments