Saturday, April 5, 2025
Homeతెలంగాణసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కన్నుమూత

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కన్నుమూత

స్పాట్ వాయిస్, బ్యూరో: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఫీవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ఆగస్టు 19న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సీతారాం ఏచూరి మృతితో.. అటు కమ్యూనిస్ట్ వర్గాల్లో, దేశ రాజకీయాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఏచూరి స్వస్థలం కాకినాడ, పూర్తిపేరు ఏచూరి సీతారామారావు. ఆయన.. 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. కాగా.. 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. సీతారాం ఏచూరి.. ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్‌ కందాకు మేనల్లుడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments