పేపర్ లీక్ కేసులో ఆధారాలు ఇవ్వండి
టీపీసీసీ చీఫ్ రేవంత్ కు సిట్ నోటీసులు
పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం
స్పాట్ వాయిస్, బ్యూరో : పేపర్ లీక్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని సిట్ ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీక్ మొత్తం ఐటీ మినిష్టర్ మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే వ్యవహారం సాగిందని, మంత్రికి తెలియకుండా జరగదని, అందులో ఆయన పాత్ర కూడా ఉందని ఇటీవల రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్పీఏ తిరుపతి, లీకేజీ కేసులో ఏ 2 గా ఉన్న నిందితులు రాజశేఖర్ ఇద్దరూ స్నేహితులని ఆరోపించారు, అసలు రాజశేఖర్‌కు ఉద్యోగం ఇప్పించింది కూడా తిరుపతేనని, ఆయన సూచనలతోనే టీఎస్ పీఎస్సీకి బదిలీ చేశారని ఆరోపించారు. మంత్రి పీఏ తిరుపతి, రాజశేఖర్ లది ఒకే మండలం అని, గ్రూప్1 పరీక్షలో అదే మండలానికి చెందిన వంద మందికి పైగా 103కు పైగా మార్కులు సాధించాయని రేవంత్ ఆరోపించారు. వీటిపై ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే సిట్ నోటీసులు అందలేదని, ఒక వేళ తనకు అందితే స్పందిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Recent Comments