స్పాట్ వాయిస్, గణపురం: శాసనమండలిలో ప్రతిపక్షనేతగా సిరికొండ మధుసూధనాచారి నియమితులయ్యారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారిని ప్రతిపక్షనేతగా నియమించాలని భారత రాష్ట్ర సమితి గతంలో కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, శాసనసభాపక్ష నేత కేసీఆర్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న మండలి చైర్మన్, ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు బుధవారం బులెటిన్ జారీ చేశారు. ప్రతిపక్ష నేత నియామకం బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
Recent Comments