ఆచార్యకు సిరికొండ నివాళి
స్పాట్ వాయిస్, గణపురం: ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా మంగళవారం తెలంగాణ భవన్ లోనీ జయశంకర్ సార్ విగ్రహానికి తెలంగాణ తొలి శాసన సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ..నాడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీన ప్రతిపాదనను విద్యార్థి దశలోనే బలంగా వ్యతిరేకించిన మొదటి వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అన్నారు. తొలి దశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తెలంగాణ వాది, మలి దశ ఉద్యమంలో కేసీఆర్ గారికి సలహాలు, సూచనలు చేస్తూ, తెలంగాణ భావజాల వ్యాప్తిలో తనదైన పాత్ర పోషించిన తెలంగాణ సిద్ధాంత కర్త, అనేక మంది తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నా కేసీఆర్ మాత్రమే తెలంగాణ సాధించగలడు అని బలంగా నమ్మిన దీర్ఘ దర్శి అన్నారు. నాడు ఆచార్య జయశంకర్ సార్ కలలుగన్న బంగారు తెలంగాణ నేడు కేసీఆర్ సాకారం చేస్తున్నారని చెప్పారు. తుది శ్వాస వరకు తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అంటూ కొనియాడారు.
Recent Comments