ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ..
స్పాట్ వాయిస్, గణపురం: మండల కేంద్రంలో బీఆర్ఎస్ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు మామిడి నర్సింహస్వామి సతీమణి పద్మ, సీనియర్ నాయకులు గుర్రం రాజేందర్ గౌడ్, రేగూరి లక్ష్మారెడ్డి, తక్కెళ్లపెల్లి సారంగపాణిలు వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొంది స్వగృహాలకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ తొలి శాసన సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆదివారం వారి ఇంటికి వెళ్ళి ఆరోగ్య వివరాలను అడిగి తెలసుకుని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సిరికొండ వెంట పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బైరగాని కుమారస్వామి, డాక్టర్ జన్నయ్య, మార్క సమ్మయ్య, అకుల తిరుపతి, రత్నం రవి, తంగెళ్లపెల్లి వెంకట్, చాంద్ పాషా, పులిగిల్ల సమ్మయ్య, మార్త శ్రీను, సూర్యదేవర కార్తీక్, పోట్ల కిష్టయ్య, తేలు రామచంద్రు, హరిప్రసాద్, పాశికంటి రామకృష్ణ, సన్ని, ఆశాడపు మధు, రెబ్బ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
Recent Comments