Thursday, June 12, 2025
Homeక్రైమ్వివాదంలో సింగర్ మంగ్లీ..

వివాదంలో సింగర్ మంగ్లీ..

వివాదంలో సింగర్ మంగ్లీ

బర్త్ డే పార్టీలో గంజాయి..

వైద్య పరీక్షల్లో పలువురికి డ్రగ్స్ పాజిటివ్..!

కేసులు నమోదు చేసిన పోలీసులు

స్పాట్ వాయిస్, హైదరాబాద్ : సింగర్ మంగ్లీ బర్తే డే వేడుకలు వివాదానికి దారి తీశాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి ఫుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రిసార్టులో భారీగా గంజాయి, విదేశీ మద్యం లభ్యంకాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న పలువురికి చేసిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ గా తేలగా, వారిపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, మంగ్లీ.. తెలంగాణ ఫోక్ సాంగ్స్‏తో పాటు బతుకుమ్మ, బోనాలతోపాటు పలు సినిమా పాటలు పాడి చాలా గుర్తింపు తెచ్చుకుంది. న్యూస్ యాంకర్ గా తన కేరీర్ షురూ చేసిన మంగ్లీ ప్రస్తుతం టాలివుడ్, ఫోక్ సాంగర్ గా చాలా పాపురల్ అయింది. ఇప్పుడు బర్త్ డే పార్టీ సందర్భంగా వివాదంలో చిక్కుకోవడం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments