తుదిశ్వాస విడిచిన సింగర్ కందికొండ
ఓరుగల్లు బిడ్డ యాదగిరి
స్పాట్ వాయిస్, నర్సంపేట: టాలీవుడ్ ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి కన్నుమూశారు. రెండేళ్లుగా ఆయన క్యాన్సర్ తో బాధపడ్డారు. అయితే చికిత్స తీసుకున్న ఆయన క్యాన్సర్ ను జయించినా ఆరోగ్యం కుదుటపడలేదు. కీమో థెరపీతో స్పైనల్ కార్డ్ దెబ్బతినింది. కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో శనివారం ఆయన ఆయన తుదిశ్వాస విడిచారు.
ఓరుగల్లు బిడ్డే..
కందికొండ స్వస్థలం నర్సంపేట మండలం నాగుర్లపల్లి. కందికొండ తెలంగాణ పల్లెపదాలు, పల్లె వాతావారణాన్ని తన అక్షరాలతో వివరించేవాడు. బతుకమ్మ పాటలతో ఫేమస్ అయ్యారు. శివమణి, పోకిరి, సత్యం,ఇడియట్, స్టాలిన్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు లాంటి సినిమాలకు పాటలు రాశారు. కందికొండ ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి పాటల రచయితగా ఫేమ్ అయ్యారు.
Recent Comments