కేసు నమోదు చేసిన పోలీసులు
స్పాట్ వాయిస్, డెస్క్: తన భార్య మటన్ వండడం లేదని ఓ భర్త డయల్ 100కు ఫోన్ చేశాడు. చివరికి కేసుల పాలయ్యాడు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని చర్ల గౌరారానికి చెందిన నవీన్ హోలీ పండగ రోజు ఫుల్ గా తాగేశాడు. అతని భార్య మాంసం వండి పెట్టలేదని ఆమెపై చర్యలు తీసుకోవాలని డయల్ 100కు ఆరుసార్లు ఫోన్ చేసి పోలీసులను విసిగించాడు. దీంతో పోలీసులు తమ సమయాన్ని వృథా చేస్తున్నాడంటూ అతడిపై కేసు నమోదు చేశారు. అత్యవసర సేవలు, ఆపద సమయంలో మాత్రమే 100కు డయల్ చేయాలని, అనవసరంగా ఫోన్‌చేసి సమయాన్ని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భార్య మటన్ వండడం లేదని డయల్ 100కి ఫోన్..
RELATED ARTICLES
Recent Comments