నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎస్సై మచ్చ సాంబమూర్తి
స్పాట్ వాయిస్, గణపురం : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై మచ్చ సాంబమూర్తి అన్నారు. ఆదివారం పోలీస్టేషన్లో మండల కేంద్రంలోని ఆటో, జీప్ డ్రైవర్స్ యూనియన్ నాయకులకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆటో, జీపు, ట్రాక్టర్ డ్రైవర్లు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పాటు డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు. సరైన పత్రాలు లేకుంటే బండ్లు సీల్ చేస్తామన్నారు. మద్యం తాగి బండ్లు నడపరాదని, మద్యం తాగి దొరికితే డ్రంకెన్ డై)వ్ కింద జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా వాహనాలను పార్కింగ్ స్థలాల్లో పార్కింగ్ చేసుకోవాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో ప్రయాణికులను ఎక్కించవద్దన్నారు. మహిళలను వేధించే అల్లరి మూకలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
Recent Comments