యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఎస్సై అభినవ్
స్పాట్ వాయిస్, గణపురం : మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎస్సై అభినవ్ అన్నారు. ఆదివారం మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వల్ల అనర్ధాలపై స్థానిక పోలీసు స్టేషన్ లో యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలో మత్తు పదార్థాలు నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. కొందరు యువత, విద్యార్థులకు మత్తు పదార్థాలు అలవాటు చేసి ధనార్జన చేస్తున్నారన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసకుంటున్నట్లు తెలిపారు. గంజాయి, సారా, మత్తుపదార్థాల వినియోగం, సరఫరాపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు. సరదాగా మత్తు పదార్థాలను అలవాటు చేసుకొని బానిసలుగా మారుతున్నారని పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. ప్రతి గ్రామంలో మత్తుపదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తామన్నారు. గంజాయి, గుట్కా, సారా, పేకాట వంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
RELATED ARTICLES
Recent Comments