Tuesday, November 26, 2024
Homeలేటెస్ట్ న్యూస్గణపురం ఎస్సై ఉదయ్ కుమార్ సస్పెన్షన్

గణపురం ఎస్సై ఉదయ్ కుమార్ సస్పెన్షన్

ఉత్తర్వులు జారీ చేసిన నార్త్ జోన్ డీఐజీ
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ఎస్సై ఉదయ్ కిరణ్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు నార్త్ జోన్ అడిషనల్ డీఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడిని ఓ కేసు విషయంలో చితకబాదడారు. అంతేకాకుండా మరుసటి రోజు సైతం రమ్మనడంతో మళ్లీ కొడుతారనే భయంతో యువకుడు పురుగుల మందు తాగాడు. ఈ క్రమంలో అతడు చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి భూపాలపల్లి ఎస్పీ జే. సురేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. గణపురం మండల కేంద్రంలోని హోండా షోరూం యజమాని ప్రోద్భలంతోనే ఎస్సై తన కొడుకు చితకబాదడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఎస్సై, షోరూం యజమానిపై ములుగు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో యువకుడి ఆత్మహత్యకు కారణంగా భావిస్తూ.. ఎస్సై ఉదయ కిరణ్ సస్పెండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments