గణపురం ఎస్సై అభినవ్
స్పాట్ వాయిస్, గణపురం: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాల బాలికలకు సైబర్ నేరాలపై అవగాహన ఉండాల్సి అవసరం ఎంతైనా ఉందని ఎస్సై అభినవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని, పిల్లలు మొబైల్ ఫోన్లు వినియోగించడంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. నేటి సమాజంలో ఇంటర్నెట్‌లో జరుగుతున్న మోసాలు, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. ఫేస్‌బుక్, వాట్సప్‌ల్లో గుర్తుతెలియని వారితో పరిచయం వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు
నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్ అన్నారు. బుధవారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అప్పయ్యపల్లె, బస్వరాజుపల్లెలో 6 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు జరిగిన సందర్భంలో దర్యాప్తునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయన్నారు. స్థానిక సంస్థలు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలు ముందుకొచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలన్నారు. మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టడానికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు జరగకుండా ఉండడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
Recent Comments