57 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ
విద్యార్థులను అభినందించిన యాజమాన్యం
ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు
షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్
స్పాట్ వాయిస్, హన్మకొండ: మళ్లీ షైన్ మెరిసింది. నిన్న ఇంటర్ ఫలితాల్లో.. నేడు టెన్త్ రిజల్ట్స్ లో సత్తా చాటింది. షైన్ విద్యాసంస్థలు, విద్యార్థులు మేటిగా నిలిచారు. 2022-23 పదోతరగతి ఫలితాల్లో హన్మకొండలోని షైన్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలిచారని షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం విడుదలైన ఎస్సెస్సీ పరీక్షా ఫలితాల్లో 57 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించగా, 70 మంది 9.8 జీపీఏ, 55 మంది 9.7 జీపీఏ, 61 మంది 95 జీపీఏతో జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏకైక విద్యాసంస్థగా నిలిచిందన్నారు. ఇక సబ్జెక్టుల వారీగా చూస్తే తమ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చినట్లు చైర్మన్ కుమార్ యాదవ్ తెలిపారు. 236 మంది విద్యార్థులు మ్యాథ్‌లో, 204 మంది సైన్స్ లో, 227 మంది సోషల్ స్టడీస్ లో, 346 మంది తెలుగులో, 238 మంది హిందీలో, 233 మంది ఇంగ్లిష్ లో 10/10 గ్రేడ్ సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులు బుధవారం పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు పి.రాజేంద్రకుమార్, మూగల రమ , షైన్ రెసిడెన్షియల్ స్కూల్ క్యాంపస్ డైరెక్టర్ జె. శ్రీనివాస్, ఐఐటీ కో ఆర్డినేటర్ మూగల రమేష్ యాదవ్, ప్రిన్సిపాల్స్ బి.సతీష్ యాదవ్, రాజ్ కుమార్, కవితారాణి, పి.విశాల్, దినేష్, ప్రగతి రెడ్డి, ఎం. సబిత విద్యార్థులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. మంచి ఫలితాల కోసం కృషి చేసిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు, తోడ్పాటు అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ తెలిపారు.
Recent Comments