నలుగురు ఉద్యోగుల అరెస్ట్..
ఇంకెవరెవరికీ చుట్టుకునేనో..
స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై కేసు నమోదు అయిన విషయం తెలిసింది. ఈ కేసులో గురువారం అరెస్టులు మొదలయ్యాయి. ఈ స్కాంపై విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు నలుగురు సీనియర్ ప్రభుత్వ అధికారులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
గొర్రెల పంపిణీ పథకం కేసు..
RELATED ARTICLES
Recent Comments