Saturday, April 5, 2025
Homeజిల్లా వార్తలుఅంగరంగ వైభవంగా దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అంగరంగ వైభవంగా దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అంగరంగ వైభవంగా దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

పాల్గొన్న లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు                  స్పాట్ వాయిస్, శాయంపేట  :   మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర, శివ మార్కండేయ ఆలయ సముదాయాల్లో ఆదివారం దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ అర్చకులు మార్త రాజకుమార్, చిందం కరుణాకర్, రంగు యాదగిరి, తాటి రమేష్ ఆధ్వర్యంలో గణపతి పూజ, అంకురార్పణ కార్యక్రమాలను వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. ఈ వేడుకలకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి, లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు హాజరుకాగా పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లోకాయుక్త జస్టిస్ కు ఆలయ విశిష్టతను తెలియజేశారు. అనంతరం దేవుని చెరువును సందర్శించి పరిశీలించారు. ఆయకట్టు విస్తీర్ణాన్ని అడిగి తెలుసుకున్నారు.  సమీపంలోని గుట్టను పరిశీలించి పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాసాని సూర్య ప్రకాష్, అఖిలభారత పద్మశాలి మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు బాసాని పద్మ, ప్రసన్నాంజనేయులు, దామరకొండ కొమరయ్య, బాల్నే తిలక్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments