మూడు రోజులుగా యువతిపై లైంగికదాడి
కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి దారుణం
స్పాట్ వాయిస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులుగా లైంగికదాడికి ఒడిగట్టారు. మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడిగా గుర్తించారు.
Recent Comments