Wednesday, April 9, 2025
Homeతెలంగాణబంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..

రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని, ఒడిశా-పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయువ్య దిశగా పయనించి.. రాబోయే మూడుగంటల్లో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా మీదుగా వెళ్తూ అదే తీవ్రతను కొనసాగిస్తూ సోమవారం అర్ధరాత్రి వరకు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్పింది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేసింది. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వివరించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments