స్పాట్ వాయిస్, రామడుగు (కరీంనగర్) : విద్యార్థులకు విజ్ఞానం, వినోదం రెండు కళ్లలాంటివని సరస్వతి హైస్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా హైదరాబాద్ లోని ఐఐటీని విద్యార్థులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఐఐటీ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెద్దిగారి మహేష్ ఐఐటీలోని వివిధ విభాగాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం వివిధ విభాగాల హెచ్ ఓడీలను కలిసి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్ లలో పలు నమూనాలు, టెలిస్కోప్ ను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఉన్నత చదువులపై విద్యార్థులకు ఆసక్తి పెంచేందుకు ఈ ఫీల్డ్ ట్రిప్ ను దోహదపడుతుందని కరస్పాండెంట్ పేర్కొన్నారు. విద్యార్థులు స్కూల్ స్థాయిలోని గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన కోసం అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ ప్రణీత, సునంద, అంజయ్య, జోసెఫ్ మనోహర్, శ్రీనివాస్, ఐఐటీ స్టూడెంట్స్ కిశోర్ కలిత, సత్యబ్రత లెంక తదితరులు పాల్గొన్నారు.
Recent Comments