Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుప్రభుత్వ సెలువుపై పట్టింపులేని ప్రైవేట్ పాఠశాలలు

ప్రభుత్వ సెలువుపై పట్టింపులేని ప్రైవేట్ పాఠశాలలు

ప్రభుత్వ సెలువుపై పట్టింపులేని ప్రైవేట్ పాఠశాలలు

రాష్ట్రం అంత బోనాల పండుగ సెలవున్నా నల్లబెల్లి మండలంలో ప్రైవేట్ పాఠశాలలకు తరగతుల నిర్వహణపై విమర్శ

స్పాట్ వాయిస్ నల్లబెల్లి:మండలంలో ప్రైవేట్ పాఠశాలల తీరుపై విమర్శలు వస్తున్నాయి. మండల విద్యా శాఖ నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రైవేట్ బడుల యజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. నిత్యం meo అందుబాటులో ఉండక పోవడం, mrc నుంచి నిఘా పెట్టేవారు కరువు అవ్వడంతో ప్రైవేట్ బడులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వారి వ్యవహారం సాగుతోంది.

ప్రభుత్వ నిబంధనలు పాటించరా

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా జరుపుతోంది. దీనికి అనుగుణంగా సోమవారం అన్ని విద్య సంస్థలకు సెలవు ప్రకటించింది. కాగా బడు లకు సెలవు ఇవ్వకుండా నిబంధనలు తుంగలో తొక్కి నల్లబెల్లి మండల ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకంగా హిందూ పండగలు అవమానిoచడం  సరి కాదని, పండుగ ప్రముఖ్యత తెలిసేలా సెలవు ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు. మండల విద్య శాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments